Request Details

Qualification required for private tuition classes

YNURE2F7
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Addressed to: Public Information Officer
4th Floor B block VTPS Road, Bhimaraju Gutta, Ibrahimpatnam, AP 521456
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ననుసరించి ఈ క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను .

1. నేను ప్రయివేట్ టీచరు గా I - V క్లాస్ పిల్లలకు నా ఇంటి వద్ద ట్యూషన్ చెప్పుకొనుటకు నాకు కావాల్సిన కనీస విద్యా అర్హతలను తెలుపగలరు .

2. నా ఇంటి వద్ద పైన తెలిపిన విధముగా నేను ఉదయము మరియు సాయంత్రం సమయాలలో క్లాసులు /ట్యూషన్ నిర్వహించుటకు ఏ శాఖ వారికి దరఖాస్తు చేసుకోవాలో తేలియజేయగలరు .

3. దరఖాస్తు అవసరమైనచో నేను సమర్పించవలసిన కాగితాలు /సర్టిఫికేట్సు మొదలైన వాటి వివరాలను మరియు దరఖాస్తు చేసుకును విధానాన్ని తెలుపగలరు .

4. ప్రభుత్వ గుర్తింపు లేకుండా మరియు ,ఏ విధమైన అనుమతులు లేకుండా ప్రయివేట్ గా ట్యూషన్ నడుపుట చట్ట వ్యతిరేకమా? అటుల అనుమతులు లేకుండా ట్యూషన్ క్లాసులు నడిపి డబ్బు సంపాదించే వారి పై ఏ విధమైన చర్యలు తీసుకోబడునో తెలుపగలరు .

5. ప్రైవేటుగా ట్యూషన్ నడుపుటకు కావల్సిన కనీస సదుపాయాలు/ పరిసరాలు /వసతులకు సoబంధించి ఏమైనా నిబంధనలు ఉన్నచో తెలుపగలరు.